Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jan-2017 16:50:32
facebook Twitter Googleplus
Photo

పదేళ్ల కిందట మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఎలాంటి ప్రకంపనలు రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే పోకిరి తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా బిజినెస్ మేన్ అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ పూరితో ఇంకో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు మహేష్. ఐతే ?టెంపర్? టైంలో మహేష్ ఆసక్తిగానే ఉన్నాడు కానీ.. జ్యోతిలక్ష్మీ.. లోఫర్ లాంటి సినిమాల ఫలితాలు చూశాక వెనక్కి తగ్గాడు. ఈ మధ్య ఇజం సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ మహేష్ తీరుపట్ల ఒక రకమైన అసహనం వ్యక్తం చేశాడు పూరి. కథ చెప్పాను.. చేద్దామన్నాడు.. తర్వాత స్పందించకుంటే ఏం చేయాలి అన్నట్లు మాట్లాడాడు. ఆ మాటల్ని బట్టే ఇప్పుడున్న స్థితిలో పూరితో మహేష్ సినిమా చేయడని అర్థమైపోయింది.

ఐతే పూరికి ఎలాంటి ఒడుదొడుకులు మామూలే కాబట్టి.. మహేష్ గురించి ఎక్కువ ఆలోచించకుండా.. తనతో చేద్దామనుకున్న జనగణమన సినిమానే వేరే హీరోతో చేయబోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్. పూరి-వెంకీ కాంబినేషన్లో సినిమా ఆల్రెడీ ఓకే అయిందన్న సంగతి తెలిసిందే. వీళ్లు చేయబోయేది ?జనగణమన?నే అన్నది తాజా కబురు. ఈ చిత్రంతో స్వయంగా వెంకీనే నిర్మాత పాత్రలోకి రానుండటం విశేషం. ఈ సినిమా బడ్జెట్ రూ.45 కోట్లని ఫిక్స్ చేశాడు పూరి. ఐతే వెంకీ అన్నయ్య రూ.20 కోట్లు మాత్రమే సమకూరుస్తుండగా.. వెంకీ మిగతా 25 కోట్లు పెట్టడానికి ముందుకొచ్చాడు. సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ మీదే ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి

,  ,  ,  ,  ,