Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 11:56:15
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 100వ సినిమా పూర్తయ్యాక రూటు మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 101వ సినిమా రైతు అనుకుంటే.. 102వ సినిమాను చేయడానికి పూరి జగన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే ఈ సినిమా కనుక పూరి జగన్ కు ఇస్తే.. పూరి ఒక కొత్త ఫీట్ చేసినవాడవుతాడు. పదండి ఆ మెగా ఫీట్ ఏంటో చూద్దాం.

నిజానికి మనకున్న స్టార్ ఫ్యామిలీస్ లో ఒక్కో ఫ్యామిలీ నుండి ఇద్దరు ముగ్గురు హీరోలు వస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి ఆ కౌంట్ కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పుడు పూరి జగన్ మ్యాటర్ కు వస్తే.. దాదాపు మెగా ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీలో హ్యాపెనింగ్ స్టార్స్ అందరితోనూ మనోడు పనిచేశాడు. పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. వరుణ్ తేజ్.. ఇలా అందరితోనూ సినిమాలు చేశాడు పూరి. మొన్ననే మెగాస్టార్ తో 150వ సినిమా అవకాశం తృటిలో మిస్సయ్యాడు. ఇక నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ తో ఆల్రెడీ పనిచేశాడు. ఇప్పుడు బాలయ్య ఒప్పుకుంటే మాత్రం పూరి రచ్చలేపినట్లేగా.

ఒకవేళ బాలయ్యతో సినిమా సెట్టవ్వకపోయినా కూడా.. ఫ్యూచర్ లో పూరి మోక్షజ్ఞను డైరక్ట్ చేసైనా కూడా.. రెండు పెద్ద సినిమా ఫ్యామిలీల స్టార్స్ అందరితోనూ పనిచేసినవాడై ఒక 'మెగా' క్రెడిట్ తన జేబులో వేసేసుకునేలా ఉన్నాడే!!

,  ,  ,  ,  ,