Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2017 15:28:36
facebook Twitter Googleplus
Photo

దర్శకుల్లో ఒక్కోరిదీ ఒక్కో శైలి. ఫలానా తరహా సబ్జెక్టును డీల్ చేయడంలో వారి ప్రతిభాపాటవాలు ఇప్పటికే పలు మార్లు ప్రూవ్ అయిపోయాయి. అయితే.. మన దగ్గర పొలిటికల్ స్టోరీలను డీల్ చేయడం అనే విషయం జోలికి పోయేందుకు కూడా చాలా మంది ట్రై చేయరు. కానీ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి చిత్రం సక్సెస్ ద్వారా సీనియర్ దర్శకుడు తేజ.. తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.

పైగా ఈయన ఇన్నేళ్లూ కొత్త వాళ్లతోనే సినిమా చేస్తానని పట్టుబట్టేవాడు. ఇప్పుడు స్టార్స్ తో సినిమా చేస్తే ప్రయోజనం ఏంటో కూడా తెలిసొచ్చింది. ఇదే ఇప్పుడు ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తేజ చెంతకు చేరేలా చేస్తోందని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కొత్త సినిమాకి రెడీ అయిన సంగతి తెలిసిందే. తన 103వ చిత్రంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్ లో ఉంది. బాలయ్య కూడా సినిమాను ప్రారంభించేందుకు మీనమేషాలు లెక్కించే టైపు కాదు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ ను వీలైనంత త్వరగా ప్రారంభించేయాలని చూస్తున్నారు. అయితే.. దర్శకుడు ఎవరన్న పాయింట్ దగ్గరే కథ ఆగిపోయింది.

ఇప్పుడు బాలయ్య దృష్టి తేజపై పడిందని.. ఇప్పటికే ఆయన నుంచి పిలుపు కూడా అందిందని తెలుస్తోంది. అన్నీ ఓకే అనుకుంటే.. కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావచ్చని అంటున్నారు.

,  ,  ,  ,  ,