Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2017 11:01:53
facebook Twitter Googleplus
Photo

కాసింత కోపంతో తిట్లనే సినిమా టైటిల్స్ గా పెడుతూ.. పూరీ తీసే యూత్ ఫుల్ మూవీస్ ప్రతీసారి ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈడియట్ నుంచి స్టార్ట్ చేసి.. పోకిరి.. దేశముదురు.. లోఫర్.. ఇలా రకరకాల తిట్లను టైటిల్స్ చేసేశాడు. వీటిలో లోఫర్ మినహాయిస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే. ఇప్పుడు రోగ్ అంటూ ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నాడు పూరీ. వేలంటైన్స్ డే సందర్భంగా రోగ్ ఫస్ట్ లుక్ లాంఛ్ చేశాడు పూరీ.

రివర్స్ లో.. అంటే కాళ్లను తాళ్లతో కట్టేసి ఇషాన్ ను వేళ్లాడదీసిన ఫోటో ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. అయినా సరే.. హీరో ఫేస్ వెలిగిపోతూనే ఉంటుంది కాబట్టి.. తన ప్రేమను చెప్పే సమయంలో హీరో ఎంచుకునే రూట్ అనుకోవచ్చు. మరో చంటిగాడి ప్రేమ కథ అంటూ పూరీ తగిలించిన క్యాప్షన్ చూస్తుటే.. ఈడియట్ లో రవితేజ పాత్రకు అప్ డేటెడ్ అండ్ లేటెస్ట్ వెర్షన్ గా రోగ్ ని చెప్పుకోవచ్చు.

తన ప్రేమ కోసం ఏదైనా చేసేందుకు రెడీ అనేట్లుగా ఉంటుందట హీరో పాత్ర. సహజంగా పూరీ హీరోలందరూ ఇలాగే ఉంటార్లే. అయితే.. రివర్స్ లో తన పనులు చక్కబెట్టుకుంటాడట. దాన్ని ఇండికేట్ చేసేందుకే ఇలా ఫస్ట్ లుక్ ఇచ్చాడని తెలుస్తోంది. తెలుగు.. కన్నడ భాషల్లో బైలింగ్యువల్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ పూరీ తీసిన చిరుత మూవీ హీరోయిన్ నేహాశర్మ చెల్లెలు ఐషా శర్మ.. రోగ్ మూవీలో హీరోయిన్ కావడం విశేషం.

,  ,  ,  ,  ,  ,