Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Mar-2016 17:23:45
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్యే ముంబయికి మకాం మార్చేసిన రామ్ గోపాల్ వర్మ.. అనుకోకుండా హైదరాబాద్లో అడుగుపెట్టాడండోయ్. పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతున్న ?ఎటాక్? మూవీ ఆడియో వేడుకలో వర్మ పాల్గొన్నాడు. హీరో మంచు మనోజ్ సైతం ఈ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా దర్శకుడు - హీరో ఒకరిని ఒకరు ఓ రేంజిలో పొగిడేసుకున్నారు.

ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను పొగడ్డం తప్పితే.. ఇంకెవరికీ పెద్దగా కాంప్లిమెంట్స్ ఇవ్వని వర్మ.. మనోజ్ గురించి మాత్రం తెగ పొగిడేశాడు. ??మనోజ్ కళ్లకు ఒక ప్రత్యేకత ఉంది. వాటికి అయస్కాంత శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. అతడి కళ్లు చాలా ఇంటెన్సిటీని చూపిస్తాయి. అందుకే అతణ్ని ఎటాక్ సినిమాకు ఎంచుకున్నా. మనోజ్ చాలా ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో చాలా బాగా నటించాడు?? అని వర్మ అన్నాడు.

అనంతరం మనోజ్ మాట్లాడుతూ వర్మపై ప్రశంసలు కురిపించాడు. ??ఆర్జీవీ అంటే ఫిల్మ్ మేకింగ్లో ఒక యూనివర్శిటీ లాంటి వాడు. అందుకే చాలామంది నటీనటులు రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా ఒక్కసారైనా ఆయనతో పని చేయాలని ఆశపడతారు. నాకు ఆయనతో పని చేయడం గొప్ప అనుభవం. వర్మ నుంచి చాలా నేర్చుకున్నా. మేం కలిసి చేసిన ప్రయత్నం జనాలకు నచ్చుతుందని ఆశిస్తున్నా?? అని మనోజ్ అన్నాడు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - వడ్డే నవీన్ - సురభి - అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషించిన ?అటాక్? ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,