Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Feb-2017 11:14:27
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు పూరి జగన్నాథ్ చేస్తున్న తాజా చిత్రం రోగ్. ఈ చిత్రం ద్వారా ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు పూరి. దాదాపు పూర్తి కావొస్తున్న ఈ సినిమా గురించి సినీ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పూరి ఈ సినిమాని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలకు చూపించాడట. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది పూరి పాత బ్లాక్ బస్టర్ ఇడియట్ ను గుర్తు చేస్తోందని, ఖచ్చితంగా ఇషాన్ కు మంచి బ్రేక్ ఇస్తుందని, అతని నటన ప్రేక్షకులు మెచ్చుకుంటుటారని అంటున్నారు.
ఇక్కడ మరొక విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వెంటనే దాన్ని తన నిర్మాణంలో సూరజ్ పంచోలిని హీరోగా పెట్టి రీమేక్ చెయ్యాలని డిసైడయ్యాడట. ఈ వార్తలన్నీ వింటుంటే పూరి తన మ్యాజిక్ ను మరోసారి పరిపూర్ణంగా రిపీట్ చేసేలానే కనిపిస్తున్నాడు. మరో వైపు అయన తన ?జనగణమన? స్క్రిప్ట్ పనుల్ని కూడా వేగంగా ముందుకు తీసుకెళుతున్నాడు. ఇకపోతే ఈ ?రోగ్? ప్రాజెక్టుని ఇషాన్ సోదరుడు, నిర్మాత సిఆర్ మనోహర్ నిర్మిస్తున్నాడు.

,  ,  ,  ,  ,