Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Nov-2015 16:36:56
facebook Twitter Googleplus
Photo

ప్రిన్స్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిలుకూరు బాలాజీ టెంపుల్ పరిసరాల్లో కీలకమైన సన్నివేశాల్ని ఇటీవలే చిత్రీకరించారు. ఈ లోగానే ఈ మూవీ ఆగిపోయిందంటూ పుకార్లు శికారు చేశాయి. మహేష్ కి - శ్రీకాంత్ అడ్డాలకి మధ్య అభిప్రాయ విభేధాలు తలెత్తాయన్న ప్రచారంతో ఉలిక్కిపడిన యూనిట్ వెంటనే క్లారిటీ ఇచ్చింది.

అయితే అది గతం గతః. ఇప్పుడు బ్రహ్మోత్సవం చిత్రీకరణ యథావిధిగా రీ స్టార్ట్ అవుతోంది. ఈ శనివారం నుంచి కంటిన్యువస్ గా హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ సాగిస్తున్నారు. ఆ వెంటనే కొత్త షెడ్యూల్ కోసం ఊటీ పయనమవుతున్నారు. అయితే మహేష్ మాత్రం ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లో డెడ్ లైన్ ప్రకారం పూర్తి చేయాల్సిందేనని శ్రీకాంత్ కి చెప్పాడని సమాచారం. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ లో వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకునేలా రిలీజ్ చేయాలని సూచించాడుట.

ఆ తర్వాత ఎలానూ తమిళ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తో సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు. అందుకే ఇప్పుడు శ్రీకాంత్ పై కాస్త ఒత్తిడి పెరిగిందని ప్రచారమవుతోంది. బ్రహ్మోత్సవం ఓ చక్కని ఫ్యామిలీ డ్రామా. రొమాంటిక్ ఎంటర్ టైనర్. కాజల్ - సమంత - ప్రణీత.. ముగ్గురు భామలతో మహేష్ రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరగా పూర్తయిపోతే.. వెంటనే మురుగదాస్ సినిమా స్టార్ట్ చేయాలని మహేష్ ప్లాన్.

,  ,  ,  ,