Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 12:35:46
facebook Twitter Googleplus
Photo

బ్లాక్ మనీపై యుద్ధం.. ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఈ మాట గత యాభై రోజులుగా దేశాన్ని ఊపేస్తోంది. బ్లాక్ మనీని అరికట్టేసేందుకు పోరాటం చేస్తున్నానని చెబుతున్నారు మోడీ. సినిమాల్లో కూడా ఇలా బ్లాక్ మనీపై చేసే పోరాటాల కాన్సెప్ట్ తో చాలానే సినిమాలు వచ్చాయి. అన్నీ ఆడేశాయని కాదు కానీ.. సెన్సేషన్స్ సృష్టించినవాటి సంఖ్య కూడా తక్కువేం కాదు.

ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి కూడా బ్లాక్ మనీపై యుద్ధం చేయబోతున్నారట. ఇన్నేళ్లూ ఎర్ర సినిమాలతో వ్యవస్థలపై పోరాటాలను సినిమాలుగా తెరకెక్కించారీయన. ఇప్పుడు బిచ్చగాడు తెలుగు వెర్షన్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో 'కానిస్టేబుల్ వెంకట్రామయ్య'గా నారాయణమూర్తి నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా బ్లాక్ మనీపై ఓ కానిస్టేబుల్ చేసే పోరాటం అనే కాన్సెప్ట్ చుట్టూనే సాగుతుందట. ఇప్పటివరకూ బ్లాక్ మనీని అరికట్టేందుకు ఏం చేయాలనే అంశంపై.. ఎవరూ టచ్ చేయని పాయింట్ ని కానిస్టేబుల్ వెంకట్రామయ్యలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

మోడీ బ్లాక్ మనీపై పోరాటం అనడం.. అదే సమయానికి నారాయణమూర్తి సినిమా తెరకెక్కుతుండడం కాకతాళీయమే అయినా.. సినిమాకి కలిసొచ్చే విషయమే. ఈ మూవీలో నారాయణ మూర్తికి జోడీగా జయసుధ నటిస్తుండడం విశేషం. మరోవైపు.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోయిన ఈ చిత్రాన్ని.. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది.

,  ,  ,  ,  ,