Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 16:22:06
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా జోరు బాగానే కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకూ మాస్ మహరాజ్ రవితేజ పక్కన మినహాయిస్తే.. బడా హీరోల సినిమాలు చేసింది లేకపోయినా.. అమ్మడి డిమాండ్ మాత్రం బాగా ఎక్కువే. పైగా లేదు లేదంటూనే.. ఎక్స్ పోజింగ్ లో హద్దులు పెట్టుకోకపోవడం ఈ భామకు బాగానే కలిసొస్తోంది.

సహజంగా టాలీవుడ్ లో మెరిసే హీరోయిన్స్ తో పోల్చితే.. రాశి ఖన్నా కొంచెం నిండైన విగ్రహమే. అందుకే తనను తాను ఎక్స్ పోజింగ్ పాత్రలకు.. ఐటెమ్ సాంగ్స్ కు పనికి రానని చెబుతూ ఉంటుంది ఈ యంగ్ బ్యూటీ. చెప్పడానికైతే అలా అంటుంది కానీ.. అందాల డోస్ మాత్రం సినిమా సినిమాకి పెరిగిపోతోంది. బెంగాల్ టైగర్.. సుప్రీమ్.. రీసెంట్ గా రామ్ తో హైపర్ సినిమాలను గమనిస్తే.. ఈ భామ ఏ స్థాయిలో ఆ హద్దును కొంచెం కొంచెం చొప్పున దాటుకుంటూ వస్తోందో బాగానే అర్ధమవుతుంది.ఇంత చేస్తూ.. ఇంకా ఐటెం సాంగ్స్ కు తాను పనికిరాననే అనుమానం రాశికి రావడం వెనక ఓ రీజన్ ఉంది.

తన పర్సనాలిటీ కారణంగా.. ఈమె డ్యాన్సుల్లో కొంచెం వీక్ గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ మధ్య వీటి విషయంలో బాగానే కాన్సంట్రేషన్ పెట్టింది. అటు ఎక్స్ పోజింగ్ చేస్తూ.. ఇటు డ్యాన్స్ లో ప్రావీణ్యత పెంచుకుంటూ.. ఇంకా ఐటెమ్ సాంగ్ చేయలేనేమో అనే అనుమానం కరెక్ట్ కాదుగా అన్నది అభిమానుల వాదన. అయితే.. ఆ అనుమానం బైట పెట్టినా ఐటెం సాంగ్స్ చేయనని నే చెప్పడం లేదంటూ ఓ కొసమెరుపు కూడా జోడించింది రాశి ఖన్నా.

,  ,  ,  ,  ,