Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2015 16:25:39
facebook Twitter Googleplus
Photo

అవికాగోర్.. టాలీవుడ్ లో సిరులు కురిపించే సీతామాలక్ష్మి. ఉయ్యాల జంపాలతో నిర్మాతలైన రామ్మోహన్ నాగార్జునలకు సూపర్ హిట్ ఇచ్చింది. అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకు ఊరటనిచ్చే హిట్టిచ్చింది. లేటెస్టుగా సినిమా చూపిస్త మావ చిత్రంతో అమెరికన్ వ్యాపారవేత్త రాజశేఖర్ కి లాభాల్ని ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పటికే 15కోట్లు వసూలు చేసింది. ఇదంతా అవిక క్రెడిట్. ఇక మునుముందు టాలీవుడ్ లో అవికాగోర్ కెరీర్ మరింత ఊపుతో కొనసాగనుంది. సరిగ్గా ఈ టైమ్ లో అవికాగోర్ ప్రేమలో పడిందంటూ ముంబై కోడై కూస్తోంది. ఓ మారు అవిక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. అక్కడ మరపురాని బ్లాక్ అండ్ వైట్ డేస్.

హిందీ టీవీ సిరీస్ శాసురల్ సిమర్ కాతో అవికాగోర్ ఫేమస్ అయ్యింది. ఈ షోలో మనీష్ రాయ్ సంగన్ కోయాంకర్. తనతో ది బెస్ట్ పెయిర్ గా సూటైంది అవిక. అప్పట్నుంచి ఈ ఇద్దరిమధ్యా స్నేహం కుదిరింది. స్నేహం ఒక్కటే కాదు.. అంతకుమించి ఇంకేదో భావన ఉంది. బుల్లితెరపై కెమిస్ట్రీ బాగా పండడానికి అది బాగా ఉపకరించిందని కూడా చెబుతుంటారు. అయితే విచిత్రంగా మనీష్ వయసు తనకంటే 20 సంవత్సరాలు ఎక్కువ. అంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నా ఈ ఇద్దరిమధ్యా స్నేహం కాస్తా ప్రేమగా మారిందని ప్రచారమవుతోంది.

ఇదే ప్రశ్న మనీష్ నే అడిగితే.. అలాంటిదేం లేదు. వయసు గ్యాప్ చాలా ఎక్కువ. నేను ఇంట్లోవాళ్లు చూసిన అమ్మాయినే పెళ్లాడుతా. అవికా నేనూ గ్రేట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతున్నాడు. మరి అవిక వైపు నుంచి సమాధానం ఏంటో?

,  ,  ,