Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jul-2016 10:46:24
facebook Twitter Googleplus
Photo

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ?రాశి ఖన్నా? కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె కెరీర్ చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఆమె నటించిన చివరి సినిమా ?సుప్రీమ్? కూడా ఘన విజయం సాధించడంతో రాశి క్రేజీ ఆఫర్లను అందుకుంటోంది. అందం, అభినయంతో సినిమా విజయానికి తన వంతు కృషి చేసే రాశి ఖన్నా తన కెరీర్లో ముందుముందు చాలెంజింగ్ పాత్రల్ని చేయాలని ఆశపడుతోంది.
అంటే మణిరత్నం గీతాంజలి సినిమాలోని గీతాంజలి తరహా పాత్రలయితే నటనకు ఆస్కారముండి తనలోని నటికి ఓ పరీక్షలా నిలబడతాయని, అలాగే మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యే పాత్రలు కూడా చెయ్యాలని ఉందని అంటోంది. ప్రస్తుతం తన చేతిలో మంచి ఆఫర్లు ఉన్నాయని, వాటితో తన కెరీర్ మరింత ముందుకెళుతుందనే నమ్మకాన్ని కూడా వ్యక్తపరుస్తోంది. ప్రస్తుతం రాశి ఖన్నా హీరో ?రామ్? సరసన ?హైపర్?, ?గోపీచంద్? సరసన ?ఆక్సిజన్? సినిమాల్లో నటిస్తోంది.

,  ,  ,  ,  ,