Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 12:41:51
facebook Twitter Googleplus
Photo

రాశి ఖన్నా. ఇప్పటివరకూ ఈ భామ చాలానే హిట్స్ కొట్టింది కానీ.. ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ సరసన చేయడం.. భారీ బడ్జెట్ మూవీలో గ్లామర్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ కొట్టడంలో.. కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే జై లవకుశ చిత్రం సక్సెస్ కోసం తాను ఎంతగా ప్రచారం చేయగలదో.. అంతా చేస్తోంది ఈ భామ.

బాబీ దర్శకత్వంలో రూపొందిన జై లవకుశ చిత్రంలో ముగ్గురు ఎన్టీఆర్ లు కనిపించనుండగా.. ఇందులో లవకుమార్ పాత్రను లవ్ చేసే అమ్మాయి పాత్రలో కనిపించనుందట రాశి ఖన్నా. సినిమాలో ఈ అందాల రాశి పేరు ప్రియ. కాస్త ఘాటుగా చెప్పుకుంటే పెళ్లిళ్ల బ్రోకర్ గా కనిపించనుంది రాశి ఖన్నా. అలా కాకుండా స్టైల్ గా చెప్పుకుంటే మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలి రోల్ లో కనిపించనుందన్న మాట. లవకుమార్ కు.. తను చేసిన ప్రియ పాత్రకు మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని.. అటు కామెడీతో పాటు ఇటు రొమాన్స్ ను కూడా బోలెడంత పంచుతాయని రాశి ఖన్నా చెబుతోంది.

దసరాకు జై లవకుశతో సందడి చేయనున్న రాశి ఖన్నా.. దీపావళికి కూడా టాలీవుడ్ ప్రేక్షకులను వదిలిపెట్టడం లేదు.

,  ,  ,  ,  ,