Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 16:16:39
facebook Twitter Googleplus
Photo

ప్రాంతీయ సినిమాలు పై కొందరు జాతీయ స్థాయి నటులు కాస్త చిన్నచూపు చూస్తారు. ఇంకొంతమంది అయితే బాలీవుడ్ వెళ్ళగానే ప్రాంతీయ సినిమా ఏమి అంత స్థాయి ఉన్న సినిమాలు తీయలేదు హింది సినిమానే నా మొదటి ప్రాధాన్యం అని ఒక స్టేట్ మెంట్ ఇస్తారు. కాని అలా స్టేట్ మెంట్లు ఇచ్చిన చాలామంది ఇప్పుడు బాహుబలి సినిమా విజయం చూసి తెలుగు సినిమా పై ఎక్కడ లేని ప్రేమ గౌరవం చూపిస్తున్నారు.

హీరోయిన్ రాధికా ఆప్టే తెలుగులో రక్తచరిత్ర- లెజెండ్ అనే సినిమాలలో హీరోయిన్ గా చేసింది. ఒక పెద్ద హీరో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడనీ చెప్పి అప్పటిలో ఒక దుమారం లేపింది . కాని ఇప్పుడు ఆమె మనసు మారింది అంటా “ఆ సంఘటన వలన నాకు సౌత్ ఫిల్మ్స్ పై అంతా ఆశక్తి లేదు అందుకే అవకాశాలు వచ్చినా చేయటంలేదు. మొన్న ‘కబాలి’ సినిమాలో నటించడం నాకు ఒక కనువిప్పులా అయ్యింది. ఇప్పుడు బాహుబలి సినిమా నిర్మాణం దర్శక ప్రతిభ చూసిన తరువాత నా అభిప్రాయం పూర్తిగా మార్చుకున్నాను” అని చెబుతోంది. ఆ మధ్య ఒక హింది సినిమాలో న్యూడ్ గా నటించి.. సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది రాధికా ఆప్టే. సౌత్ సినిమాలు అప్పుడు నచ్చకపోవడానికి ఇప్పుడు నచ్చడానికి కారణం బాహుబలి అంటారా అవకాశవాదం అంటారో తెలియటం లేదు మరి. మొత్తానికి బాహుబలి తెలుగు సినిమాకు చాలా రకాలుగానే గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ క్రెడిట్ అంతా మన జక్కన్నకే చెందుతుంది.

ఇక గతంలో తెలుగు సినిమా వేస్ట్ అని కామెంట్స్ చేసిన ఇలియానా.. అలాగే తన స్థాయి ఆఫర్లు రావడం లేదని చెప్పిన తాప్సీ కూడా.. ఇప్పుడు తెలుగు ఈజ్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,