Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 11:13:33
facebook Twitter Googleplus
Photo

రాజ్ తరుణ్.. హ్యాట్రిక్ యంగ్ హీరో అనిపించుకుని దూసుకుపోయాడు ఈ కుర్ర హీరో. మధ్యలో ఓ ఫ్లాప్ వచ్చినా.. మళ్లీ సక్సెస్ ట్రాక్ స్టార్ట్ చేశాడు. అయినా సరే.. రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం గాడిలో పడిందని చెప్పడానికి లేదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఇతను చేయాల్సిన ప్రాజెక్టుల్లో వేరే హీరోలను తీసుకోవడం.. రాజ్ తరుణ్ తో అనౌన్స్ చేసి ప్రాజెక్టులు వేరే వారి చేతుల్లోకి వెళ్లిపోవడం.. పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరూ ఈ కుర్ర హీరోతో సినిమా చేసేందుకు ముందుకు రాకపోవడం వంటివి ఇబ్బంది పెడుతున్నాయి.

వీటన్నిటితో పాటు ఈ మధ్య రాజ్ తరుణ్ ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ఓ యంగ్ డైరెక్టర్ ను పరిచయం చేస్తూ అనౌన్స్ చేయగా.. ఆ ప్రాజెక్ట్ లో ఇప్పుడు దర్శకుడు మారిపోయాడు. ఈ వచ్చిన కొత్త వ్యక్తి కూడా తొలిసారిగా దర్శకత్వం వహించేవాడే. అలాగే.. తనే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ని హ్యాండిల్ చేసేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా రాజ్ తరుణ్ మేనేజర్ కారణంగానే అని అంటున్నారు.

తన స్థాయి కంటే ఎక్కువగా తనను తాను ఊహించుకోవడానికి కారణం ఈ మేనేజర్ అన్నది.. సన్నిహితుల వాదన. చాలామంది పెద్ద డైరెక్టర్ల కంటే - పెద్ద స్టార్ల కంటే నువ్వే బెటర్ అన్నట్లుగా ఉంటుందిట ఈయన ప్రాంప్టింగ్. ఈ దెబ్పతో రాజ్ తరుణ్ కొండెక్కి కూచున్నాడని అంటున్నారు. ఇంతకీ రాజ్ తరుణ్ మేనేజర్ ఎవరో తెలుసా.. సీనియర్ నటుడు రాజారవీంద్ర.

,  ,  ,  ,  ,  ,