Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Oct-2017 12:28:42
facebook Twitter Googleplus
Photo

హిట్లు కావాలంటే పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు పోటీ రాకూడదనే పాత సిద్ధాంతం మారిపోయింది. భారీ సినిమాలు బాగానే ఆడేస్తున్నా.. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలకు కూడా మంచి ఆదరణే లభిస్తోంది. అందుకే ఇప్పటివరకూ పండుగలన్నీ పెద్ద హీరోల సినిమాలకే పరిమితం కాగా.. ఇప్పుడు ధైర్యంగా తమ చిత్రాలను కూడా తెస్తున్నారు ఇతర హీరోలు.

రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ రాజు గాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతోన్నట్లు.. నిర్మాత సుంకర రామబ్రహ్మం ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ పై ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోయిన మాట వాస్తవమే. ఎందుకంటే జనవరి 10న పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ రిలీజ్ కానుంది. ఈ దీపావళి నుంచి ఆ సినిమాకి సంబంధించిన లుక్స్ విడుదల కానున్నాయి. అయితే.. పవన్ కి పోటీగా వచ్చేందుకు ఇతర భారీ చిత్రాల నిర్మాతలు సంకోచిస్తున్న సమయంలో.. అదే సమయానికి రాజ్ తరుణ్ మూవీని అనౌన్స్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అయితే పండుగ సీజన్ కావడంతో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చనే చెప్పాలి.

సంజనా రెడ్డి దర్శకత్వంలో రూపొందిన రాజుగాడు.. ఏకే ఎంటర్టెయిన్మెట్స్ బ్యానర్ పై రూపొందింది. మాకు రాజ్ తరుణ్ తో వరుసగా ఇది మూడో సినిమా. కిట్టు ఉన్నాడు జాగ్రత్త నుంచి మొదలైన ప్రయాణం.. అంధగాడు.. ఇప్పుడు రాజు గాడు వరకూ కొనసాగుతోంది.

,  ,  ,  ,  ,  ,