Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2016 12:53:26
facebook Twitter Googleplus
Photo

బర్నింగ్ స్టార్ అనిపించుకున్న సంపూర్ణేష్ బాబు.. మధ్యమధ్యలో తన ట్వీట్స్ తో బర్న్ అవుతూ ఉంటాడు. సెన్సిటివ్ ఇష్యూల నుంచి.. ఫన్నీ ఇన్సిడెంట్స్ వరకూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అవడం సంపూ స్టైల్. ఇప్పుడు జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ పై సంపూ వేసిన ఓ ట్వీట్.. ఆన్ లైన్ లో తెగ రచ్చ చేస్తోంది.

కొరటాల శివతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజ్ మూవీ ఫస్ట్ లుక్ ను.. జూనియర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో బైక్ పై వెళుతున్న ఎన్టీఆర్ కు సైడ్ లుక్ కనిపిస్తుంది. సంపూ ఇప్పుడు దీనిపైనే రియాక్ట్ అయ్యాడు. 'సైడ్ యాంగిల్ లో ఉన్నాడు.. సైడ్ అయిపోతాడని అనుకున్నారేమో.. నేరుగా ఫేస్ చేసే దమ్ము నీకొచ్చినప్పుడు విశ్వరూపమే' అంటూ తనే సొంతగా సెట్ చేసిన ఓ పంచ్ డైలాగ్ ను ట్వీట్ చేశాడు సంపూర్ణేష్.

బృందావనం మూవీలో ' సిటీ నుంచి వచ్చాడు - సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడని అనుకుంటున్నారేమో.. కేరక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా.' అంటూ ఓ పంచ్ డైలాగ్ పేల్చుతాడు ఎన్టీఆర్. ఇప్పుడా డైలాగ్ నే కొత్తగా పారడీ చేశాడు సంపూ. ఎలాగూ తను చేసేవన్నీ స్పూఫ్ లే కదా. అలా ఎన్టీఆర్ డైలాగ్ ని ఎన్టీఆర్ కే స్పూఫ్ చేసేశాడు సంపూర్ణేష్.

,  ,  ,  ,  ,  ,