Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-May-2017 15:11:51
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాలో ఎనర్జటిక్ కుర్ర హీరోలకు మంచి గిరాకీ ఉంది. అలాంటి సినిమాలుతో మొదలై కొందరు హీరోలు కూడా అయ్యారు. అలాంటి కథలుతో వచ్చిన ఇప్పటి తుంటరి హీరో రాజ్ తరుణ్ ఇపుడిప్పుడే ఒక గాడిలో పడుతున్నాడు. ఉయ్యాల జంపాలా తో పాస్ మార్క్లు తెచ్చుకొని సినిమా ఆఫర్లు బాగానే తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుసగా కాస్త క్రేజీ సినిమాలే చేస్తున్నాడు.

లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక కొత్త ప్రాజెక్టుకు రాజ్ తరుణ్ హీరోగా ఎన్నుకున్నారు. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ నటించిన అలా ఎలా సినిమా డైరెక్టర్ అనీష్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నారు. రాజ్ తరుణ్ ఇప్పుడు తన కొత్త సినిమా అందగాడు విడుదలకు సిద్దింగా ఉంది ఈ సినిమా జూన్ 1న విడుదల కావచ్చు. అనిల్ సుంకరతో మూడు సినిమాలతో ఒప్పందం నుండి ఇప్పుడు కుర్రాడు విముక్తి పొందాడు. ఇలాంటి టైమ్ లో దిల్ రాజు బేనర్లో సినిమా రాజ్ తరుణ్ కెరీర్లో గొప్ప అవకాశంగానే చెప్పాలి. ఎందుకంటే దిల్ రాజు నిర్మిస్తే అది ఫ్యామిలి మొత్తం చూసేలా ఉంటుంది మంచి కథ ఉంటేనే సినిమా నిర్మిస్తారు. రాజ్ తరుణ్ ఇంతవరుకు యూత్ సినిమాలే చేశాడు. ఇప్పుడు దిల్ రాజు సినిమాతో మరో మెట్టు పైకి వెళ్లవచ్చు మనోడు.

కొత్త డైరెక్టర్లని కొత్త రచయతలను పరిచయం చేసిన క్రెడిట్ దిల్ రాజుకు ఇప్పటికే ఉంది కూడా. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి ఫ్రెష్ కథతో వస్తున్నారట.

,  ,  ,  ,  ,  ,