Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2017 11:38:32
facebook Twitter Googleplus
Photo

తనదైన స్టయిల్ అండ్ యాక్షన్ తో ఆ క్యారెక్టర్ కు మంచి ఊపు తెస్తాడు మాస్ మహారాజా రవితేజ. ముఖ్యంగా కామెడీ మిక్స్ డ్ కమర్షియల్ ఎంటర్ టెయినర్లు రవితేజకు కొట్టిన పిండి. అయితే వరసగా ఒకే తరహా పాత్రలు చేస్తుండటం.. సినిమాల్లో కొత్తదనం లేకపోవడంతో సరైన హిట్ కొట్టి చాలాకాలమే అయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

దిల్ రజు నిర్మాణంలో వస్తున్న రాజా ది గ్రేట్ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. ఇంతకుముందు పటాస్ - సుప్రీమ్ సినిమాలతో డీసెంట్ హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఎ రేటింగ్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుందనేది ఇన్ సైడ్ టాక్.

మహానుభావుడులో శర్వానంద్ కు జంటగా నటించిన మెహ్రీన్ రాజా ది గ్రేట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అయినప్పటికీ ఇందులో రవితేజ మార్కు కామెడీ మిస్సవదని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెబుతున్నాడు. మామూలు కథలోనే ఎమోషన్స్ మిక్స్ చేసి ఎంటర్ టెయినింగ్ చెప్పడం అనిల్ రావిపూడి స్పెషాలిటీ. రాజా దిగ్రేట్ కూడా అదేవిధంగా ఆకట్టుకుంటుందనే కాన్పిడెంట్ తో ఉన్నాడు.

,  ,  ,  ,