Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2015 14:18:00
facebook Twitter Googleplus
Photo

నిన్నే హీరోయిన్ లయకు అమెరికాలో పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని.. ఆమె లాస్ ఏంజిల్స్ సమీపంలో కారు ప్రమాదానికి గురవ్వడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యిందని వార్తలొచ్చాయ్. మరో ఆర్తి అగర్వాల్ దుర్ఘటన తరహాలో ఏదైనా వినాల్సి వస్తుందేమోనని అందరూ కాస్త భయపడ్డారు.

అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదట. ''ఈరోజు ఉదయం నుండి నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అందుకే ఈ వీడియో సందేశం పంపుతున్నాను. నాకు ఏమీ కాలేదు. కార్ యాక్సిడెంట్ అనేది అవాస్తవం. దయ చేసి మీడియా మిత్రులు ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఓసారి నిజాలని వెరఫై చేసి పబ్లిష్ చేయండి. మిత్రులు అభిమానలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఐ యామ్ ఫైన్'' అంటూ వీడియో సందేశం పంపింది లయ.

2006లో ఎన్నారైను పెళ్ళి చేసుకొని లయ అమెరికాలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఆమె అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

,  ,  ,