Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2017 10:46:26
facebook Twitter Googleplus
Photo

మాస్ మహారాజ ఒకప్పుడు తనదైన శైలిలో స్పీడ్ గా సినిమాలను తీసేవాడు. అయితే గత కొంతకాలంగా అయన స్పీడ్ కు ఫెయిల్యూర్స్ అడ్డు పడుతుండడంతో కాస్త స్లో గా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా సక్సెస్ గమ్యాన్ని చేరుకోవాలని లెట్ అయినా పర్లేదు అంటూ.. గాడి లో పడాలని చూస్తున్నాడు. త్వరలోనే "రాజా ది గ్రేట్" సినిమాతో రవితేజ మళ్లీ తన గత వైభవం లోకి రావాలనుకుంటున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. వచ్చే నెల అక్టోబర్ 12న రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇంకా రిలీజ్ కూడా కానీ ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్మడుపోయాయని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తంగా 18 కోట్లకు ఈ చిత్రం కథ పలికినట్లు టాక్. ఈ చిత్రానికి కథ - దర్శకత్వం అనిల్ రావి పూడి అందిస్తున్నాడు. మొదటి సారి శిరీష్ పూర్తిగా నిర్మాణ బాధ్యత విలువల్ని మోస్తున్నారు.

అయితే రాజా ది గ్రేట్ సినిమా రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడం నిజంగా షాకింగ్ విషయమని టాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేకూరినట్లయ్యింది. సినిమాలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందొ తెలుస్తోంది. రవి తేజ ఈ సినిమాలో కళ్లు లేనివాడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,