Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2017 10:34:47
facebook Twitter Googleplus
Photo

ఐదు ఏళ్ళు పాటు పడిన కఠోర శ్రమకు ఇప్పుడు బాహుబలి టీమ్ మొత్తం ఆ ఫలాలును ఆస్వాదిస్తుంది. బాహుబలి సినిమాను రాజమౌళి నిర్మించిన తీరు టీమ్ ను లీడ్ చేసే విధానం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కొందరికి గొప్పగా ఊహించే శక్తిని ఇచ్చింది. అటువంటి టీమ్ ఇప్పుడు కొద్ది కాలం అందరికీ దూరంగా వాళ్ళుకు సొంతమైన మనుషులతో ఆనందంగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు.

ఇప్పుడు రాజమౌళి అతని ఫ్యామిలితో కలిసి లండన్ కి సమ్మర్ హాలిడేస్ కి వెళ్లనున్నాడు. ఈ బ్రేక్ రాజమౌళికి అవసరమైనది కావలిసినదే కదా. ఎందుకంటే అతను చేసిన అలుపెరిగిని నిర్మాణ పోరాటానికి కొంత విరామం అవసరం. బాహుబలి 2 విడుదల భారత సినిమా చరిత్ర లోనే ఎప్పుడులేని కలెక్షన్స్ సాధించింది గొప్ప ఆదరణ పొందింది. రాజమౌళి ఒక్కడే కాదు ఆ సినిమాకు పని చేసిన నటీనటులు కూడా వేరు వేరు హాలిడేస్ స్పాట్ కి వెల్లుతున్నారు. రాజమౌళి లండన్ ట్రిప్ పూర్తియైన తరువాత ఫ్యామిలి తో కలిసి భూటాన్ కూడా చుట్టి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

జక్కన్న ఈ ఏడాదిలో ఇంకా ఏ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాబట్టి తనకు సరిపడా సమయం తీసుకొని తనకు సరియైన స్క్రిప్ట్ ఎంచుకొనే టైమ్ ఉంది. దీనితో పాట బాహుబలి 2 ప్రమోషన్ కోసం మే మూడో వారంలో అమెరికా కూడా వెళ్ళుతున్నాడట.

,  ,  ,  ,  ,