టాలీవుడ్ లో దాసరి నారాయణ రావు , ఎస్.ఎస్.రాజమౌళి పేర్లు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది వారి క్రియేటివిటీ.ఇక వీరిద్దరూ టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అని అంటుంటారు.తెలుగు ఇండస్ట్రి లో దాసరి నారాయణరావు ని ?గురువుగారు? అని అందరూ ముద్దుగా పిలుచుకుంటుంటారు.ఇండస్ట్రి లో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడంలో దాసరి ముందుంటారు.ఇక ఎవరి దగ్గరైన మంచి స్క్రిప్ట్ ఉంది ప్రోడ్యుస్ చేసే అంత బడ్జెట్ లేకపోతే వారికి కూడా దాసరి సహాయం చేస్తుంటాడు.
ఇక రాజమౌళి దాసరి అడుగుజాడల్లో నడుస్తున్నాడు.రాజమౌళి చిన్న చిత్రాల ఫస్ట్ లుక్స్ , టీజర్స్ ని రిలీజ్ చేస్తూ , ఆ సినిమాలను ఎంకరేజ్ చేస్తూ వాటి పై ట్వీట్స్ కూడా చేస్తున్నారు.ఇక ఇప్పుడు రాజమౌళి ని అందరూ ఈగో లేని డైరెక్టర్ గా , మరొక దాసరి గా పిలుస్తున్నారు.ఇక ఈ ఇద్దరి దర్శకులు ఒకే స్వభావం కలిగి వుండడం విశేషం.