Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-May-2017 11:25:08
facebook Twitter Googleplus
Photo

బాహుబలి 2 సినిమా కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారత చలనచిత్ర పరిశ్రమలో ఏమాత్రం ఊహించని ఫిగర్స్ ఈ సినిమాకు నమోదవుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయన్న మాటను కొందరు సినీ ప్రముఖులు అన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. వెయ్యి కోట్ల మార్కు కాదు కానీ.. ఆలోపే క్లోజ్ అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపించింది. అయితే.. ఊహించని రీతిలో భారీ కలెక్షన్లను సొంతం చేసుకోవటమే కాదు.. ప్రస్తుతం రూ.1700 కోట్ల మార్క్ ను టచ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు దర్శకులు రాజమౌళి.

కలెక్షన్ల లెక్కల్ని పక్కన పెడితే.. భారీగా బడ్జెట్ పెట్టి.. భారీ రిస్క్ చేసిన బాహుబలి 2 నిర్మాతలకు మిగిలింది ఎంత? ఏ మాత్రం లాభం వచ్చిందన్న ఆసక్తికరమైన ముచ్చట్లను ఒక ప్రైవేటు ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి మాట్లాడారు.

కలెక్షన్లు భారీగా ఉన్నప్పటికీ.. నిర్మాతలకు వచ్చే లాభం మాత్రం తక్కువే ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు రాజమౌళి. ఇప్పటికి బాహుబలి2 కలెక్షన్ రూ.1500 కోట్ల మార్క్ను దాటిందని.. రూ.1700 కోట్ల వరకు ఆగిపోవచ్చని తాము అనుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. చైనాలో రిలీజ్ చేయాల్సి ఉందని.. అక్కడ తమ సినిమా దంగల్ మాదిరి ఆడాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు.

చైనాలో వచ్చేది తక్కువేనని.. అన్ని ఖర్చులు పోనూ 12.5 శాతమే చేతికి వస్తుందన్నారు. రూ.100కోట్ల కలెక్షన్లు వస్తే.. రూ.12.5 కోట్లు మిగులుతాయన్నారు. గ్రాస్ కలెక్షన్లు రూ.1500 కోట్లు అంటే.. నిర్మాతకు సగమన్నా వస్తుందా? అంటే.. రాదని చెప్పారు రాజమౌళి.

అలా ఎలా అన్న దానికి ఆయనిచ్చిన సమాధానం ఏమిటంటే.. ఆంధ్రా రైట్ అవుట్ రేట్ కి అమ్మేశారని.. ఎంతకు అమ్మేశారో అంతే వస్తుందని.. అదనంగా నిర్మాతకు ఏమీ రాదని.. అన్నీ ఖర్చులు పోనూ నిర్మాతకు వచ్చేది తక్కువగా చెప్పారు. రూ.ఐదారు వందల కోట్లు పెట్టుబడి పెడితే రూ.వంద కోట్లు కూడా రాదా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పని రాజమౌళి.. ఇష్టంతో నిర్మాత సినిమా తీస్తారని.. దర్శకుడికి.. హీరోకు.. ఇతర ఆర్టిస్టులకు డబ్బులు వస్తాయని.. నిర్మాతకు డబ్బులు సంపాదించటం చాలా తక్కువేనని చెప్పారు. నిర్మాణంలో చాలా జాగ్రత్తగా ఉంటూ.. అన్ని విషయాల మీద పట్టు ఉంటే తప్పించి డబ్బులు మిగలవని.. హిట్ అనుగుణంగా డబ్బులు వస్తాయనుకోవటం తప్పని తేల్చేశారు

,  ,  ,  ,  ,  ,