Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 10:18:50
facebook Twitter Googleplus
Photo

దశాబ్దం కిందట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో తానూ ఒకడిగా ఉండేవాడు రాజమౌళి. మగధీర ముందు వరకు అతను మామూలు కమర్షియల్ డైరెక్టరే. కానీ మగధీర తో తన స్థాయిని ఒక్కసారిగా ఎంతో పెంచుకున్నాడు. అక్కడి నుంచి రాజమౌళికి రాజమౌళితోనే పోటీ. మరెవ్వరూ లేదు అతడికి సాటి. ఈగ సినిమాతో దర్శకుడిగా ఎన్నో మెట్లు ఎక్కిన రాజమౌళి.. బాహుబలి తో ఏ స్థాయిని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మగధీరతో టాలీవుడ్లో మిగతా దర్శకులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన రాజమౌళి.. బాహుబలి-1తో ఇండియాలో ఇంకే దర్శకుడూ టచ్ చేయలేని స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు బాహుబలి-2 రిలీజయ్యాక రాజమౌళికే రాజమౌళిని అందుకోవడం కష్టం అనే పరిస్థితి వచ్చేసింది.

బాహుబలి: ది కంక్లూజన్ తో రాజమౌళి నెలకొల్పిన ప్రమాణాల్ని అందుకోవడం.. మళ్లీ అతడికే కష్టం కావచ్చు. తొలి భాగం తర్వాత ఏర్పడిన అసాధారణ అంచనాల్ని కూడా అందుకుని.. బాహుబలి-2 తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేస్తున్నాడు జక్కన్న. ఇప్పుడతను శిఖరంపై ఉన్నాడు. బాహుబలి ముందు వరకు అతను తెలుగు దర్శకుడు. ఇక్కడి ప్రేక్షకులు మాత్రం అతడిపై భారీ అంచనాలతో ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు దేశమంతా కోట్లాది మంది అతడి అభిమానులుగా మారిపోయారు. అతడి నుంచి భారీగా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తర్వాత ఏం సినిమా తీస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇది కచ్చితంగా రాజమౌళిపై ఒత్తిడి పెంచేదే. ఇప్పటిదాకా తన గత సినిమా సక్సెస్ వల్ల ఏర్పడే అంచనాల్ని అందుకోవడం రాజమౌళికి అంత కష్టమయ్యేది కాదు. కానీ ఈసారి మాత్రం అది అంత సులువైన విషయం కాదనే భావిస్తున్నారు. బాహుబలి: ది బిగినింగ్ కు కొనసాగింపు కాబట్టి బాహుబలి: ది కంక్లూజన్ తో అంచనాల్ని అందుకోవడం కష్టమేమీ కాలేదు. జానపద చిత్రం కాబట్టి రాజమౌళి ఏం చేయడానికైనా అవకాశం దక్కింది. కానీ ఈసారి ఓ మామూలు కథను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు రాజమౌళి. మరి అలాంటి మామూలు కథతో ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు

,  ,  ,  ,