Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 12:56:11
facebook Twitter Googleplus
Photo

దర్శకుడిగా రాజమౌళి సంపాదించిన ఇమేజ్ ఇండియాలో మరే డైరెక్టర్ కూ సాధ్యం కానిది. ఇక హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ సాధించిన పేరు ప్రఖ్యాతుల గురించి.. ఆయన ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే దానికి ఆకాశమే హద్దు అన్నది చాలామంది అభిప్రాయం. అది బాహుబలి ని కూడా మించిపోతుందని అంటున్నారు. మలయాళంలో ప్రేమమ్ లాంటి ఆల్ టైం క్లాసిక్ తీసిన అల్ఫాన్సో పుతెరిన్ ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే అది అవతార్ కన్నా పెద్దదవుతుందన్నాడు. ఈ మాటలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు కానీ.. ఈ కాంబో అయితే మామూలుగా ఉండదన్నది వాస్తవం.

రాజమౌళి కూడా రజినీతో సినిమా చేయడానికి ఆశపడున్నట్లు.. రజినీ కూడా ఆసక్తితోనే ఉన్నట్లు కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లండన్ లో బాహుబలి టీంతో కలిసి ఓ సినీ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి.. అక్కడ బీబీసీ వాళ్లతో చిట్ చాట్ సందర్భంగా రజినీతో సినిమా గురించి స్పందించాడు. రజినీకాంత్ చాలా పెద్ద స్టార్. ఆయన అణకువకు మారుపేరు. రజినీ సార్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా కల నెరవేరినట్లే. నేను కూడా అందుకు మినహాయింపు కాదు. ఐతే నేను ఎవరితో ఏ సినిమా చేయాలన్నా కథే నన్ను నడిపించాలి. కథను బట్టే నటీనటుల్ని ఎంచుకుంటా. ఆయనకు సరిపడే కథ నా దగ్గరుంటే.. ఆయనతో సినిమా చేసేలా కథ నన్ను ఇన్ స్పైర్ చేస్తే కచ్చితంగా చేస్తా.

,  ,  ,  ,  ,