Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2017 10:38:39
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో రాజ్ తరుణ్.. కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఆ తర్వాత ఓ ఫ్లాప్ ఎదురైనా.. ఈడోరకం ఆడోరకం మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పుడీ చిత్రానికి ట్రైలర్ రిలీజ్ అయింది.

ముందు నుంచి చెబుతున్నట్లుగానే కుక్కల కిడ్నాపింగ్ తోనే ట్రైలర్ బిగిన్ చేశాడు దర్శకుడు. కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బులడుగుతావా సిగ్గులేదూ.. అని ఓ కేరక్టర్ అడిగితే.. 'మిమ్మల్ని కిడ్నాప్ చేసి కుక్కల్ని డబ్బులు అడగలేం కదండీ' అంటూ వేసిన పంచ్ తోనే.. ఈ మూవీ కాన్సెప్ట్ అర్ధమవుతుంది. ఇక కౌబాయ్ టైపులో.. 'భౌ బాయ్' అనే పద ప్రయోగం కూడా బాగుంది. ఇదో లవ్ స్టోరీ అన్న మాట అని రాజారవీంద్రతో చెప్పించి.. హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం బాగుంది.

రఘుబాబును స్వామీజీగా చూపించి.. 'అప్పుడెప్పుడో సినిమా స్టార్టింగ్ లో కనిపించాడు విలన్.. మళ్లీ పిలిపించండి' అంటూ విలన్ రోల్ చేసిన అర్బాజ్ ఖాన్ ను తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఓ సేఫ్ ని కిడ్నాప్ చేయడం.. ఫైట్స్.. ఛేజింగ్.. హంగామాతో ట్రైలర్ నడిపారు. మధ్యలో రాజ్ తరుణ్-అను ఇమాన్యుయేల్ ల లిప్ లాక్ చూపించి రొమాంటిక్ జోనర్ ని.. హంసానందిని ఐటెంసాంగ్ తో మాస్ ఎలిమెంట్స్ ని బాగానే మిక్స్ చేశారు. మొత్తం మీద కిట్టు మాత్రం బాగా ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాడు. కామెడీ వర్కవుట్ అయితే మాత్రం.. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'కు కాసుల పంట ఖాయం అని ఫిక్స్ అయిపోవచ్చు

,  ,  ,  ,  ,  ,  ,