Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 12:30:23
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ దర్శకుల్లోనే కదు.. ఇండియా మొత్తంలో హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకడన్నది జనాల నమ్మకం బాహుబలి లాంటి మెగా బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడి ఇండియాలోనే అత్యధిక పారితోషకం అందుకుని ఉన్నా అది సమంజసమే. ఆ విషయంలో ఎవరికీ అభ్యంతరాల్లేవు. ఐతే రాజమౌళి పారితోషకం ఎంత అన్నది మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. కొందరు అన్ని కోట్లు తీసుకున్నాడంటారు. కొందరు పారితోషకం లాంటిదేమీ లేదు.. లాభాల్లో వాటానే అంటారు. మరి ఇంతకీ పారితోషకం విషయంలో రాజమౌళి ఏమంటున్నాడు..? బాహుబలి కి ఎంత తీసుకున్నారని అడిగితే.. అతనేమని బదులిచ్చాడు..?

నేను నా సినిమాలకు సంబంధించి పర్సెంటీజీ తీసుకుంటాను. ఇదేమీ సీక్రెట్ కాదు. బాహుబలి సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్ తక్కువే తీసుకున్నాను. సినిమా హిట్ అయితే పర్సెంటీజీలు తీసుకుంటాను. లేకపోతే పోతుంది. ఇది నా రిస్కే కదా. ఇలా చేసినా సరే నిర్మాతను టెన్షన్ పెట్టినట్లే అని భావిస్తాను. బాహుబలి మెగా హిట్టయింది. దీని రెవెన్యూ వేరు. దీన్నే అన్నింటికీ ప్రామాణికంగా తీసుకోకూడదు. నేను తీసుకునే పర్సెంటేజీ ఎంత అన్నది చెప్పకూడదని కాదు. నా విషయం చెబితే ఇతరుల రెమ్యూనరేషన్లు.. పారితోషకాల గురించి కూడా చెప్పాలి. అది నాకిష్టం ఉండదు. కాబట్టి నా పర్సెంటేజీ ఎంతో చెప్పలేను అన్నాడు రాజమౌళి. ఐతే తనతో సినిమా చేయాలనుకునే నిర్మాత భారీ పారితోషకం ఆఫర్ చేస్తే సినిమా చేసేయనని.. ఆయనకు సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంది.. మంచి సినిమా కోసం ఎంత తపిస్తాడనే చూస్తానని రాజమౌళి తేల్చి చెప్పాడు.

,  ,  ,  ,  ,