Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Apr-2017 11:17:22
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ.. ఈ చిత్రానికి సంబంధించి హైప్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సినిమాలో ఉన్న ప్రతీ పాత్రతోనూ జనాలు సూపర్బ్ గా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు అయితే.. విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇప్పుడా పాత్రను లీడ్ గా తీసుకుని ఓ టీవీ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి చెప్పాడు. ఆనంద్ నీలకంఠన్ రాసిన బుక్ ట్రయాలజీ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాం. ఇదేమీ డైలీ సీరియల్ బాపతుగా ఉండదు. 13 ఎపిసోడ్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ తీయాలని భావిస్తున్నాం అని చెప్పాడు జక్కన్న. శివగామి ఆ స్థాయికి ఎలా ఎదిగిందనే విషయాన్ని ఈ బుక్ సిరీస్ వివరిస్తుంది. మాహిష్మతిని పాలించే రాణిగా ఆమె ఎలా ఎదిగిందనే విషయాన్ని చెబుతుందని అంటున్నాడు రచయిత.

ఈ పుస్తకం అంతా శివగామి గురించే ఉంటుంది. అఫ్ కోర్స్ పక్కనే కట్టప్ప కూడా ఉంటాడు. తన తండ్రిని ద్రోహి అనడంతో మొదట్లో మాహిష్మతి నాశనం చేయాలని భావించిన శివగామి.. ఆ తర్వాత పరిస్థితుల ప్రకారం మారి రాణి స్థాయికి ఎలా చేరుకుందన్నదే ఆమె ప్రయాణం.

,  ,  ,  ,  ,  ,  ,