Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 11:02:07
facebook Twitter Googleplus
Photo

సౌత్ బ్యూటీ శృతి హాసన్ కు ఇప్పటివరకూ ఎన్నడూ ఎరుగనన్ని విమర్శలు.. కాటమరాయుడు మూవీలో ఈ భామ లుక్స్ పై వచ్చాయి. కెరీర్ తొలినాళ్లలో హిట్ అనేదే లేకుండా ఏళ్ల పాటు శృతి ఎదురు చూసింది కానీ.. ఏనాడూ ఈమెకు విమర్శలు ఎదురు కాలేదు. కానీ కాటమరాయుడులో లావుగా ఉందంటూ.. చూసేందుకు కూడా ఇబ్బంది పడేలా ఉందంటూ.. డ్రస్సులు దారుణంగా ఉన్నాయంటూ రకరకాల కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇలాంటి సమయంలో శృతిహాసన్ కు ఊరట కలిగించే ఓ సందర్భం కలిసొచ్చింది. ప్రస్తుతం ఈ భామను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలను దాటేయడం విశేషం. ఈ మార్క్ అందుకున్న అతి కొద్ది మంది తారల జాబితాలో శృతి కూడా చేరిపోయింది. 5 మిలియన్ల ఫాలోయర్స్ మార్క్ ను అందుకున్న సందర్భంగా తన సంతోషాన్ని సోషల్ మీడియా సాక్షిగా వెలిబుచ్చింది శృతి హాసన్. 5 మిలియన్లను అందించిన ప్రతీ అందమైన వారికి కృతజ్ఞతలు. మీ ప్రేమ.. మద్దతు నాకు చాలా చాలా ఇష్టం. ఇంతమందికి కలిపి ఓ జెయింట్ హగ్ ఇచ్చేయాలని ఉంది అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్.

సోషల్ మీడియా ద్వారా అనేక అంశాలను అభిమానులతో.. ఫాలోయర్స్ పంచుకునే శృతి హాసన్.. ఒక్క బాయ్ ఫ్రెండ్ విషయంలోనే గుంభనంగా ఉంటోంది.

,  ,  ,  ,  ,