Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 10:22:29
facebook Twitter Googleplus
Photo

అసలు డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమాలో స్టయిలిష్ స్టార్ లుక్ ఎలా ఉంటుందో చెప్పండి అంటే.. అబ్బే మీరు కాసినన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అన్నాడు డైరక్టర్ హరీశ్ శంకర్. ఇక పొరపాటను ఫోటోలకు ఫోజులిచ్చినా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంతే జాగ్రత్తపడుతున్నాడు. కనీసం హెయిర్ స్టయిల్ కూడా లీకవ్వనివ్వట్లేదు గురుడు.

ఈ మధ్యకాలంలో మెగా హీరోలందరూ ఏదో యాగం చేస్తున్నట్లు షూటింగ్ స్పాట్లలో తమ అభిమానులను తెగ కలుస్తున్నారు. సరిగ్గా నిన్న షూటింగ్ స్పాటులో బన్నీ కూడా అదే చేశారు. అయితే అందరితోనూ.. మేకప్ వేసుకోక మునుపు లేదంటే మేకస్ తీసేసిన తరువాత మాత్రమే ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. అలా చూస్తుంటూ బన్నీ హెయిర్ స్టయిల్ అండ్ మాసిన గెడ్డం.. అన్నీ పాతవిగానే ఉన్నాయి. కాని సినిమాలో మాత్రం మనోడు ఒక బ్రాహ్మిణ్ గెటప్ లో దంచేస్తున్నాడనేది టాక్. అంటే లుక్ అస్సలు లీకవ్వకుండా ఆ విధంగా జాగ్రత్తపడుతున్నారనమాట.

ఇకపోతే వరుసగా హిట్టులు కొడుతున్న బన్నీ.. ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేశాడంటే మాత్రం.. టాలీవుడ్ బిగ్ లీగ్ లో మనోడు తన స్థానాన్ని కొన్నేళ్ళపాటు సుస్థిరం చేసుకున్నట్లే.

,  ,  ,  ,  ,  ,