Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2017 10:14:25
facebook Twitter Googleplus
Photo

గతంలో ఓ సూపర్ స్టార్ చేసిన కామెంట్స్ ను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మిగిలిన అన్ని విషయాల కంటే కలెక్షన్స్ మాత్రమే కీలకం అయిపోయిన ఇప్పటి పరిస్థితుల్లో ఈ కామెంట్స్ అక్షరాలా నిజం. ఈ వారానికి స్టార్.. రియల్ హీరో ఎవరంటే.. సీనియర్ హీరో రాజశేఖర్ అని ఒప్పుకోవాల్సిందే.

టీజర్.. ట్రైలర్ వచ్చే వరకూ ఏ మాత్రం ఆసక్తి క్రియేట్ చేయని చిత్రం పీఎస్వీ గరుడవేగ. అసలీ సినిమా మీద దాదాపు 25కోట్లు పెట్టుబడి పెట్టేస్తున్నారంటేనే అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చూపించిన న్యూఏజ్ థ్రిల్లర్ జనాలను మెప్పించింది. గరుడవేగ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితుల్లో వేగంగా మార్పులొచ్చేశాయి. తొలి రోజున వసూళ్లు డల్ గానే ఉన్నాయి. కానీ మౌత్ టాక్ పవర్ ఏంటో చూపించిన సినిమాగా గరుడవేగ నిలవనుంది. శనివారం నాటికి పుంజుకున్న వసూళ్లు.. ఆదివారం నాటికి హౌస్ ఫుల్స్ కు చేరుకున్నాయి. ఈ వారంలో టాప్ వసూళ్లతో అగ్రస్థానంలో కూర్చుంది గరుడవేగ. ఇక రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం మెరుపులు తొలి వీకెండ్ కే పరిమితం అయ్యాయి. ఈ వీకెండ్ లో కూడా ఏ మాత్రం ఆశాజనకంగా పరిస్థితిలేదు.

హారర్ కామెడీ జోనర్ లో వచ్చిన నెక్ట్స్ నువ్వేకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదు. అల్లు అరవిందే సపోర్ట్ చేసిన సినిమాగా గుర్తింపు వచ్చినా.. జనాల్లో ఆసక్తి క్రియేట్ చేయడంలో మూవీ ఫెయిల్ అయింది. ఇక హెబ్బా పటేల్ మూవీ ఏంజెల్ సిట్యుయేషన్ కూడా ఏమీ బాలేదు.

,  ,  ,  ,  ,