Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 10:55:39
facebook Twitter Googleplus
Photo

సౌత్ ఇండియన్ సినిమా మీద విపరీతమైన ప్రభావం చూపిన సినిమాల లిస్టు తీస్తే అందులో ?బాషా? పేరు ముందు చెప్పుకోవాలి. ట్రెండ్ సెట్టర్ అనే పదానికి అసలు సిసలైన అర్థం చెప్పిన చిత్రమిది. రెండు దశాబ్దాల కిందట రిలీజైన ఈ సినిమాను ఇప్పటికీ కొందరు అనుకరిస్తూ.. అదే ఫార్మాట్ లో సినిమా తీస్తున్నారంటే దాని ప్రభావమేంటో అర్థం చేసుకోవచ్చు. రజినీకాంత్ ను అసలు సిసలు సూపర్ స్టార్ ను చేసింది.. తెలుగులోనూ ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది ఈ సినిమానే. 1995లో రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో మళ్లీ తమిళనాడులో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ డిసెంబరు 12న రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ?బాషా? రీ రిలీజ్ అవుతోంది. రీ రిలీజ్ అంటే.. ఏదో ఒకటి రెండు థియేటర్లలో కాదు. తమిళనాడు వ్యాప్తంగా ఒక కొత్త సినిమాను రిలీజ్ చేసినట్లు ప్రతి సెంటర్ లోనూ ?బాషా?ను రిలీజ్ చేస్తారట. రజినీ కొత్త సినిమాలకు హంగామా చేసినట్లే దీనికి కూడా హడావుడి చేయడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. మన దగ్గర రీ రిలీజ్ సంస్కృతి పోయింది కానీ.. తమిళనాట ఇప్పటికీ ఆ కల్చర్ కొనసాగుతోంది. హిట్టు సినిమాల్ని కొంత కాలం తర్వాత రీ రిలీజ్ చేయడం.. వాటికి అప్పుడు కూడా ఆదరణ దక్కడం అక్కడ కొనసాగుతోంది. అందులోనూ బాషా రీరిలీజ్ ను అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,