Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Mar-2017 15:39:08
facebook Twitter Googleplus
Photo

కొత్త రికార్డులు క్రియేట్ చేయడం సూపర్ స్టార్ రజినీకాంత్ కి కొత్తేమీ కాదు. రీసెంట్ గా కబాలి ఎన్నేసి సెన్సేషన్స్ సృష్టించిందో చూశాం. ఇప్పుడు రజినీ నటించిన ఆల్ టైం ఫేవరేట్ మూవీ బాషా.. మళ్లీ రిలీజ్ అయింది.

డిజిటల్ వెర్షన్ బాషాను బాక్సాఫీస్ దగ్గర దించేశారు. ఇవాళే డిజిటల్ బాషా థియేటర్లలో సందడి చేస్తున్నాడు. 22 ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజ్ అయినా సరే.. ఈ మూవీకి క్రేజ్ చూస్తే.. రజినీ స్టామినా ఏంటో అర్ధమవుతుంది. మల్టీప్లెక్సులతో సహా దాదాపు అన్ని థియేటర్లలోనూ డిజిటల్ బాషా దిగిపోయాడు. అంచనాలకు మించిన కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు. చూస్తుంటే.. కలెక్షన్స్ లో అప్పటి బాషా రికార్డులతో పాటు రీసెంట్ రికార్డులు కూడా చాలావరకూ మాయం అయిపోయేట్లుగా ఉన్నాయి.

సెకండ్ రిలీజ్ లో ఈ మూవీకి జనాల నుంచి వస్తున్న ఆదరణ చూసి.. ట్రేడ్ జనాలు షాక్ అవుతున్న పరిస్థితి. ఏకంగా ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించారంటే.. బాషా బజ్ ఏంటో అర్ధమవుతుంది.

,  ,  ,  ,  ,  ,  ,