Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 13:26:03
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ?కబాలి?, ?రోబో 2.0? అనే రెండు క్రేజీ సినిమాలను సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ?రోబో 2.0? ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళగా, ?కబాలి? ఈ సమ్మర్‌లోనే విడుదలకు సిద్ధమవుతోంది. ?విక్రమసింహ?, ?లింగ? లాంటి భారీ పరాజయాల తర్వాత అభిమానులను ఎలాగైనా అలరించాలని, రజనీ, ఈ రెండు సినిమాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. తమిళంలో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న పా. రంజిత్ దర్శకత్వంలో రజనీ చేస్తోన్న కబాలి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈమధ్యే రజనీ కాంత్ తన డబ్బింగ్ పార్ట్‌ను మొదలుపెట్టారు. ఇక కేవలం ఐదు రోజుల్లో రజనీ, తన డబ్బింగ్ మొత్తాన్నీ పూర్తి చేసేశారట. రజనీ, ఓ పక్క ?రోబో 2.0? షూట్‌లో పాల్గొంటూనే మరోపక్క ?కబాలి? డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేయడం విశేషం. కళైపులి థాను భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించారు. మే నెలాఖర్లో లేదా జూన్ మొదటి వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,  ,