Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 12:26:01
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం విషయంలో అనేకానేక పుకార్లు వినిపించాయి. ఆయన ఏదో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. రోబో సీక్వెల్ 2.0 సినిమాను పూర్తి చేసే పరిస్థితుల్లో కూడా లేరని.. ఎలాగోలా ఈ చిత్రాన్ని ముగించి.. సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ మధ్య వైద్య చికిత్స కోసం రెండు నెలల పాటు అమెరికాలో రజినీ ఉన్న సమయంలో ఈ ప్రచారాలు గట్టిగా సాగాయి.

కానీ అక్కడి నుంచి ఇండియాకు వచ్చాక రజినీ స్పీడుమీదున్నారు. చకచకా ?2.0? షూటింగ్ పూర్తి చేసేసి.. విడుదలకు ఇంకా పది నెలల సమయం ఉండగానే డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నారు. ఇంకో వారం పది రోజుల్లో ?2.0?కు సంబంధించి రజినీ పనంతా పూర్తయినట్లే అని సమాచారం. ఆ తర్వాత రజినీ కొన్ని రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుని.. తన తర్వాతి సినిమా మీద దృష్టిపెట్టబోతున్నారు. ?కబాలి? దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలోనే రజినీ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

కబాలి తరహాలోనే చాలా వేగంగా ఈ చిత్రాన్ని చేయడానికి రజినీ ప్రణాళికలు రచించుకుంటున్నాడు. ?2.0? థియేటర్లలోకి రావడానికి ముందు ఈ చిత్రాన్ని రజినీక పూర్తి చేయబోతున్నాడట. ఆల్రెడీ పా.రంజిత్ ఈ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేశాడు. ముంబయి బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా కోసం ముంబయితో పాటు ఇంకొన్ని లొకేషన్లు కూడా ఫైనలైజ్ చేశాడు. జనవరిలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందట. ఆరేడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలన్నది ప్లాన్. రజినీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం.

,  ,  ,  ,  ,