Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2015 11:12:35
facebook Twitter Googleplus
Photo

మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ కలసి ఇటీవల 'ఎవడు' సినిమాలో నటించినప్పటికీ, అందులో అర్జున్ గెస్ట్ పాత్ర మాత్రమే చేశాడు. అయితే, వీరిద్దరూ కలసి ఫుల్ లెంత్ సినిమా చేస్తే ఇక అభిమానుల ఆనందానికి అంతే వుండదు కదా! ఇప్పుడు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా అదే పనిలో ఉన్నట్టుంది. అందుకే, గత కొన్నాళ్ల క్రితం 'చరణ్ -అర్జున్' అనే టైటిల్ని రిజిస్టర్ చేసింది. మళ్లీ ఇప్పుడు తాజాగా దీనిని రెన్యూవల్ చేసినట్టు చెబుతున్నారు. ఈ హీరోలిద్దర్నీ కలిపి భారీ సినిమా నిర్మించాలన్న ఉద్దేశంతోనే అల్లు అరవింద్ ఈ టైటిల్ని కాపాడుకుంటూ వస్తున్నారని అంటున్నారు. మరి, అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి!

,  ,  ,  ,  ,  ,  ,