Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2017 10:17:31
facebook Twitter Googleplus
Photo

దీపావళికే వస్తుందన్నారు 2.0 సినిమా. కానీ తర్వాత జనవరి 25కు వాయిదా పడిపోయింది. ఆ తేదీకి అందరూ ఫిక్సయిపోయి సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తుండగా.. మూడు రోజుల కిందట మళ్లీ వాయిదా వార్తలు వచ్చాయి. దీంత అందరిలోనూ అయోమయం నెలకొంది. మొన్నే దుబాయిలో అంగరంగ వైభవంగా ఆడియో వేడుక చేసి.. ఇంతలో ఇలా సినిమాను వాయిదా వేసేయడం ఏంటి అనుకున్నారు. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన హైప్ కారణంగా.. ఇది ఎప్పుడొస్తుందన్నదాన్ని బట్టి వేరే సినిమాల రిలీజ్ డేట్లు కూడా సర్దుబాటు చేసుకోవాల్సి రావడంతో ఇటు టాలీవుడ్లో.. అటు కోలీవుడ్లో గందరగోళం నెలకొంది.

ఈ గందరగోళానికి తెరదించకుండా 2.0 టీం సైలెంటుగా ఉండిపోయింది. మీడియాలో మాత్రం 2.0 వాయిదా పడటంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మూడు రోజుల పాటు ఈ చిత్ర బృందం ఏమీ స్పందించకపోవడంతో వాయిదా సంగతి నిజమే అనుకున్నారంతా. కానీ ఇంతలోనే కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. 2.0 వాయిదా పడటం లేదట. యధావిధిగా జనవరి 25నే ఈ సినిమా రిలీజవుతుందట. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై చెప్పారు. ఆయన ఏదైనా అథెంటిక్ సమాచారం ఉంటేనే ట్వీట్ చేస్తారు. ఆయన ఇలా ట్వీట్ చేస్తారంటే అందులో నిజం ఉండి ఉండొచ్చు.

,  ,  ,  ,  ,  ,