Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jan-2017 12:25:52
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో.. ఈ సారి టాలీవుడ్ కి సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తొలి మూడు రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయిపోవడం చూస్తుంటే.. మెగాస్టార్ తో కలిసి ఫ్యాన్స్ సంక్రాంతిని ఎంజాయ్ చేసేందుకు ఏ రేంజ్ లో సిద్ధమయ్యారో తెలుస్తోంది. ఆ తర్వాత వీకెండ్స్ వరకూ ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ ఖాయం అనడంలో పెద్దగా సందేహాలు అక్కర్లేదు.

అయితే.. మెగాస్టార్ మూవీ రిలీజ్ తోనే సంక్రాంతి పూర్తయిపోవడం లేదు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఎందుకంటే.. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజున అంటే జనవరి 14న.. పవన్ కళ్యాణ్ అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాడు. తన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు టీజర్ ను పండుగ కానుకగా ఇచ్చేందుకు సిద్ధం చేయించాడట పవర్ స్టార్.. ఇప్పటివరకూ పోస్టర్లతో సరిపెట్టిన పవన్.. ఇప్పుడు టీజర్ లో యాక్షన్.. రొమాంటిక్.. ఎంటర్టెయినింగ్ సీన్స్ తో పర్ఫెక్ట్ సంక్రాంతి ట్రీట్ రెడీ చేశాడని తెలుస్తోంది.

మరో మెగా హీరో సాయిధరం తేజ్ కూడా సంక్రాంతికి తన మూవీ విన్నర్ టీజర్ రిలీజ్ చేయనున్నాడు. ఫిబ్రవరి 24న ఈ మూవీ రిలీజ్ కానుండగా.. సంక్రాంతి స్పెషల్ గా టీజర్ ని ఇవ్వబోతున్నారు. మామయ్యలను అచ్చుగుద్దినట్లు చూపించి అలరించే తేజు.. పొంగల్ పండుగ.. మెగా ఫెస్టివల్ గా మారడంలో తన వంతు పాత్ర పోషించబోతున్నాడు.

,  ,  ,  ,