Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 12:36:55
facebook Twitter Googleplus
Photo

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం రోబో2.0. 2010లో విడుదలైన రోబో కు సీక్వెల్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కబాలి తరువాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్న రజనీ ఈ మధ్యే షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందన్న ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.
ఇకపోతే ఇన్నాళ్లు ?రోబో2.0? ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఓ శుభవార్త బయటికొచ్చింది. అదేమంటే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ నవంబర్ 20న ఆదివారం నాడు విడుదల చేయనున్నారు. ఇంతకు ముందే ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత్ దర్శకుడు ఏ. ఆర్ రెహమాన్ సంగీతమే అందిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

,  ,  ,  ,  ,  ,