Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2017 14:09:04
facebook Twitter Googleplus
Photo

బాహుబలి తర్వాత ప్రభాస్ కొత్త సినిమా ఏంటనే విషయంలో క్లారిటీ ఉంది. సాహో టీజర్ కూడా ఇచ్చేయడంతో.. ఈ మూవీపై ఆసక్తి బాగానే ఉంది. ప్రస్తుతం బాహుబలి కేరక్టర్ కోసం పెరిగిన వెయిట్ ను తగ్గించుకుంటూ మేకోవర్ చేస్తున్న ప్రభాస్.. రీసెంట్ గా యూఎస్ ట్రిప్ ముగించుకుని కూడా తిరిగి వచ్చేశాడు.

ఈ మూవీకి పక్కా షూటింగ్ షెడ్యూల్ ఇప్పటికే చెప్పేశాడు దర్శకుడు సుజిత్. మొదటగా ముంబైలో షూటింగ్ చేయనుండగా.. అక్కడి వీధుల్లో కొంత భాగం తెరకెక్కించనున్నారు. ఇందులో రెయిన్ సీక్వెన్స్ లు కూడా ప్లాన్ చేసుకున్నారు. వర్షాకాలంలో షూటింగ్ ప్లాన్ చేసుకోవడం కూడా ఉద్దేశ్యపూర్వకమే. అయితే.. సాహో టీమ్ ఇలాగే ముంబయ్ వర్షాల్లో సినిమా తీద్దాం అనుకున్నారు. కాని వారికంటే ముందే రజనీకాంత్ తీసేస్తున్నాడు. ఇప్పటికే కాలా కరికులన్ షూటింగ్ జరిగిపోతోంది. ఈసారి అనుకున్న సమయం కంటే ముందే వర్షాలు రావడంతో.. రజినీ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. వర్షం పడితే రెయిన్ సీక్వెన్స్.. లేకపోతే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూట్ చేస్తున్నాడు దర్శకుడు పా రంజిత్.

ఏమైనా ముంబై వర్షాలను బేస్ చేసుకుని రెండు భారీ చిత్రాలు ఒకేసారి తెరకెక్కనుండడం విశేషమే.

,  ,  ,  ,  ,