Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2016 12:49:33
facebook Twitter Googleplus
Photo

ఈ వేసవికి భారీ అంచనాల మధ్య ?సర్దార్ గబ్బర్ సింగ్? రావడం, అనుకున్నంత ప్రభావం చూపలేకపోవడం కూడా అప్పుడే జరిగిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫోకస్ అంతా సర్దార్ తర్వాత వస్తోన్న పెద్ద సినిమా అయిన ?సరైనోడు? వైపుకి షిఫ్ట్ అయిపోయింది. భోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేస్తుందన్న ప్రచారంతో మరో ఐదు రోజుల్లో థియేటర్లలో వాలిపోనుంది. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాకు టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ వల్ల ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇక దీనికి తోడు ఈ సినిమా సాటిలైట్ రైట్స్ బిజినెస్ చూస్తే సరైనోడుకి ఏ స్థాయి క్రేజ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మళయాలం.. మూడు వర్షన్స్‌కు సంబంధించిన సాటిలైట్ హక్కులను సన్ నెట్‌వర్క్ సుమారు 16 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుందని తెలుస్తోంది. రిలీజ్‌కు ముందు ఓ సినిమా ఈ స్థాయి సాటిలైట్ రెవెన్యూ సాధించడం తెలుగు సినిమాలో ఇదే మొదటిసారి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ సరసన రకుల్ ప్రీత్, క్యాథరిన్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,  ,