Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2017 12:05:06
facebook Twitter Googleplus
Photo

కామెడీ జోనర్ లో తొలిసారి స్టార్టు కనిపించిన చిత్రం రాజుగారి గది-2. మళయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా డైరెక్టర్ ఓంకార్ తీసిన సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా బాగుందనే టాక్ తో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతోంది. తొలిపార్ట్ సాధించిన అనూహ్య విజయంతో పి.వి.పి. ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థతో కలిసి ఓంకార్ ఈ సినిమాను రూపొందించాడు. టాలీవుడ్ కొత్త పెళ్లి కూతురు సమంత తన కెరీర్ లో ఫస్ట్ టైం ఆత్మ పాత్ర చేసింది.

ఓవర్సీస్ లో రాజుగారిగది-2 కు పెద్దగా ఆదరణ లేకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసుల వద్ద సందడి బాగానే ఉంటోంది. మూడు రోజు ల వ్యవధిలోనే రూ. 12 కోట్లకు పైగానే షేర్ రాబట్టింది. దీంతో ముందు సినిమా ఫలితంపై హీరో నాగ్ డౌట్ పడ్డా ఇప్పుడు ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు. ఈ సినిమా హిట్ కావడం నిర్మాతలకు ఇంకో రకంగానూ కలిసొచ్చింది. తెలుగు - హిందీ భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ భారీ మొత్తం లభించిందనేది లేటెస్ట్ టాక్. ఈమొత్తం రూ. 8 కోట్లకు పైనే అని తెలుస్తోంది.

ఈ సినిమా మూవీ శాటిలైట్ రైట్స్ కు ఇంత భారీ ఆఫర్ అవడానికి కారణం ఇందులో నాగార్జున తోపాటు ఆయన కోడలు సమంత కూడా నటించడం.

,  ,  ,  ,  ,