Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2017 13:20:13
facebook Twitter Googleplus
Photo

నాగ చైతన్య పుట్టిన రోజు. బర్త్ డే సందర్భంగా అభిమానులకు ముందురోజే తన కొత్త సినిమా సవ్యసాచి ఫస్ట్ లుక్ ను ఇచ్చేశాడు చైతు. ప్రస్తుతం ఈ మూవీ పనులు జోరుగానే సాగుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేసి ఈ చిత్రం షూటింగ్ ను చకచకా చేసేస్తున్నారు.

చైతు పుట్టిన రోజును పురస్కరించుకుని.. సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్.. దర్శకుడు చందూ మొండేటిలతో పాటు కమెడియన్ వెన్నెల కిషోర్.. సవ్యసాచి పాత్రధారి అయిన నాగచైతన్యతో కేక్ కట్ చేయించారు. సవ్యసాచి అంటే అర్ధం.. గురి చూసి బాణం వేసేవాడు అని. ఇప్పుడు బాణాలు వేసే ట్రెండ్ కాదు కాబట్టి.. చేతిలో ఓ కత్తి పెట్టి కేక్ కోయించేశారు సవ్యసాచి టీం. కొంచెం గ్లామర్ ఒలకబోస్తున్న నిధి అగర్వాల్ చేతిలో బొకే పట్టుకుని మరీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. అర్ధరాత్రి సమయంలో.. సరిగ్గా 12 గంటలు దాటగానే ఈ పోటోను నెట్ లో షేర్ చేశాడు వెన్నెల కిషోర్.

కొత్త పెళ్లి కొడుకు అయిన చైతు భలే సింపుల్ గా కనిపిస్తున్నాడు. ఇది తన ప్రొఫెషన్ లో భాగంగా సినిమా యూనిట్ తో జరుపుకున్న పుట్టిన రోజు వేడుక. ఇప్పుడు తన భార్య కం టాప్ హీరోయిన్ సమంతతో అక్కినేని హీరో తన బర్త్ డే వేడుకలను ఎలా జరుపుకున్నాడనే విషయం తెలుసుకునేందుకు అక్కినేని ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,  ,