Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2015 12:37:41
facebook Twitter Googleplus
Photo

ఒక్క సినిమా వాయిదా పడేసరికి చూడండి.. ఎలా ఉందో పరిస్థితి. ఇప్పటికే రెండు సినిమాలు లైన్ లోకి వచ్చాయి. ఇప్పుడు ఇంకో సినిమా తయారైంది. ?అఖిల్? సినిమా వాయిదా అన్న వార్త బయటికి వచ్చిన 24 గంటల్లో ఆ సినిమాను రీప్లేస్ చేయడానికి మూడు సినిమాలు రెడీ అయిపోయాయి. ఇప్పటికే కంచె - షేర్ సినిమాలు 22న విడుదలకు సిద్ధమవగా.. తాజాగా ఓ చిన్న సినిమా కూడా అదే తేదీన రిలీజ్ కు తయారైంది. ఆ సినిమా మరేదో కాదు.. యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్రర్ కామెడీ ?రాజుగారి గది?. ఇప్పటికే తొలి కాపీ కూడా రెడీ చేసుకుని.. మంచి టైమింగ్ కోసం చూస్తున్న ?రాజుగారి గది? సినిమా దసరా సెలవుల అడ్వాంటేజి చూసుకుని 22న విడుదలైపోతోంది. కంచె - షేర్ సినిమాలు రేసులో ఉన్నప్పటికీ.. అదే రోజు విడుదల చేయాలని ఫిక్సయ్యారు దర్శక నిర్మాతలు.

ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ ??రాజుగారి గది పక్కా ప్రణాళికతో రూపొందిన హర్రర్ కామెడీ చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది. అనుకున్న టైమ్ లో - అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేశాం. ఇటీవల విడుదల చేసిన లోగో ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని చూసి నచ్చడంతో ప్రముఖ నిర్మాతలు సాయికొర్రపాటిగారు అనీల్ సుకంర గారు సమర్పకులుగా వ్యవహరించడం చాలా హ్యపీగా ఉంది. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నాం. భయం హాస్యంతో పాటు పర్పస్ ఉన్న మూవీ. చాలా కష్టపడి చేశాం. డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడి ప్రేక్షకులకు తప్పకండా నచ్చుతుంది?? అన్నాడు.

,  ,  ,  ,