Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2015 11:04:20
facebook Twitter Googleplus
Photo

అఖిల్ కథానాయకుడుగా వినాయక్ తెరకెక్కిస్తోన్న సినిమా ప్రస్తుతం స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. ఇది అఖిల్ మొదటి సినిమా కావడం వలన .. ఆడియన్స్ అంచనాలు ఎక్కువగా వుండటం వలన ఫైట్స్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఆడియన్స్ కి థ్రిల్ ని కలిగించేలా కొత్తగా ఈ సినిమాలోని ఫైట్స్ ని కంపోజ్ చేశారు.

సహజంగానే వినాయక్ సినిమాల్లోని యాక్షన్ సీన్స్ హై వోల్టేజ్ తో ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. ఆయన ఆశించే స్థాయిలో ఉండేలా ఫైట్ మాస్టర్ రవివర్మ ఈ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశాడు. అఖిల్ చేసే ఈ ఫైట్స్ చూసిన వాళ్లంతా అదుర్స్ అనకుండా వుండలేరట. నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ భారీబడ్జెట్ సినిమాలో, సాయేషా సైగల్ కథానాయికగా అలరించనుంది. మొత్తం మీద స్పెయిన్లో పాటలే కాదు .. ఫైట్లు కూడా ఆడియన్స్ కి పండుగ చేస్తాయన్న మాట.

,  ,  ,  ,  ,  ,