Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 10:37:44
facebook Twitter Googleplus
Photo

అసలు రకుల్ ప్రీత్ సింగ్ అంటేనే చాలా ఫిట్టుగా ఉన్న రేర్ హీరోయిన్ అని చెప్పుకోవాలి. మన భామల్లో స్వయంగా నాది సైజ్ 4 అంటూ డైరక్టుగా తన బాడీ కొలతల గురించి డేరింగ్ గా చెప్పేసుకున్న ఏకైక భామ ఈ సుందరి. మరి ఆ ఫిట్నెస్ కు రేప్ బాధితులకూ లింకేంటి అంటారా? ఇప్పుడు తన ఫిట్నెస్ ను వాడేసి వారికి సహాయం చేస్తోంది ఈ సుందరి.

ఈ నవంబర్ 20న హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో ''ఫిట్నెస్ అన్ ప్లగ్గడ్'' అనే ఒక ఈవెంట్ జరుగనుంది. ఈ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ ఏకంగా 5 గంటలపాటు నిర్వధికంగా ఫిట్నెస్ ఫీట్లన్నీ చూపించనుంది. ఆమెతోపాటు చాలామంది ఇతర తారలు.. అలాగే ఫిట్నెస్ ప్రియులు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. సాధారణంగా జరిగే 5కె రన్ ఈవెంట్ టైపులోనే ఇది కూడా ఒక పీపుల్ పార్టిసిపేటింగ్ ఈ వెంట్ అనుకోండి. అయితే ఈ కార్యక్రమానికి వెళ్ళాలంటే చూపర్లు టిక్కెట్లు కొనుక్కోవాల్సిందే. డబ్బులు తీసుకుని మరీ ఈ ఈవెంట్ ఎందుకో అంటారా? ఆ కలక్షన్ అంతా రేప్ బాధితుల సహాయార్ధం ఉపయోగించనున్నారు.

రకుల్ ప్రీత్ తో పాటు ఈ కార్యక్రమంలో ఆమె ఫిలిం ఇండస్ర్టీ స్నేహితురాళ్ళు రాశి ఖన్నా అండ్ రెజీనా కసాండ్రా కూడా పాల్గొంటారట. అలాగే ఇతర హీరోలు కూడా కొంతమంది పాల్గొంటారట. అది సంగతి.

,  ,  ,  ,  ,