Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 10:54:05
facebook Twitter Googleplus
Photo

గాలి జనార్ధన రెడ్డి ప్యాలెస్ లో ఆయన కూతురు బ్రాహ్మణి పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. ఇంకా ఈ వేడుకలు మరికొన్ని రోజులు కంటిన్యూ అవుతాయి కానీ.. వరుడు మూడు ముళ్లు వేసిన రోజున హంగామా మామూలుగా లేదు. సౌత్ లో చాలామంది సినిమా తారలు తమ డ్యాన్సులతో మెరుపులు మెరిపించేశారు.

ఇందులో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. పెళ్లిలో చిందులు వేసేందుకు బాగానే పారితోషికం అందుకున్న ఈ బ్యూటీ.. తాను తీసుకున్న మొత్తానికి న్యాయం చేసేసింది. వన్ సైడ్ స్ట్రాప్ మాత్రమే ఉన్న డ్రస్సులో రెచ్చిపోయిందీ బ్యూటీ. ఇక జిగేల్ మనే డ్రస్ కు తోడు.. అదిరిపోతున్న లైటింగ్ మధ్యలో రకుల్ వేసిన డ్యాన్స్.. పెళ్లికి వచ్చిన ఆహుతులు అందరికీ కనువిందు చేసింది. తాను ఎంత మంచి డ్యాన్సర్ అనే సంగతితో పాటు.. ఎంత ట్యాలెంట్ గల పెర్ఫామర్ అనే విషయాన్ని కూడా రకుల్ ప్రీత్ ప్రూవ్ చేసేసింది.

అందుకే కదా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ పట్టేస్తూ టాలీవుడ్ ని ఏలేందుకు పరుగులు పెడుతోంది. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఇంత షార్ట్ గ్యాప్ లో.. చరణ్.. మహేష్ లతో చేస్తున్న ఈమెను.. పవన్ సినిమాలో కూడా తీసుకునే ప్రపోజల్ ఉండడానికి రీజన్ ఇదే కదా.

,  ,  ,  ,  ,  ,