Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 14:54:00
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్యే మహేష్ బాబు-మురుగదాస్ సినిమాకు కమిటైంది రకుల్ ప్రీత్ సింగ్. ఐతే దీని కంటే ముందే రకుల్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సింది. కానీ అప్పట్లో డేట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమాకు నో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అదే డేట్ల సమస్యతో ఇంకో సినిమా నుంచి తప్పుకుంటోందట రకుల్ ప్రీత్. ఆ సినిమా పేరు.. తుప్పారివాలన్. తమిళంలో విశాల్ హీరోగా విలక్షణ దర్శకుడు మిస్కిన్ రూపొందిస్తున్న సినిమా ఇది. కొన్ని నెలల కిందటే రకుల్ ప్రీత్ ను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సినిమా విషయంలో రకుల్ చాలా ఎగ్జైట్ అయింది కూడా. కానీ ఇప్పుడు డేట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వస్తోంది.

ఓవైపు మహేష్ బాబు సినిమా చేస్తూనే.. మరోవైపు సాయిధరమ్-గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటోంది రకుల్. ఐతే విశాల్ సినిమా అనుకున్న సమయానికి మొదలుకాకపోవడంతో ఆమెకు ఇబ్బంది ఎదురైంది. ఇంకొన్ని రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుండగా.. ఈ చిత్రానికి డేట్లు సర్దుబాటు చేయలేనంటూ రకుల్ తప్పుకున్నట్లుగా సమాచారం. ఆ చిత్రంలో శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ మరో కథానాయికగా నటిస్తుండటం విశేషం. రకుల్ నో చెప్పేయడంతో తక్కువ టైంలో మరో హీరోయిన్ కోసం వేట సాగించాల్సి వస్తోంది. మరోవైపు రకుల్ తమిళంలో విక్రమ్ సరసన ?సామి? సీక్వెల్ కు ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. రకుల్ లేటెస్ట్ మూవీ ?ధృవ? డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,