Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jul-2017 12:22:26
facebook Twitter Googleplus
Photo

గోపీచంద్ కు టైం అస్సలు కలిసిరాలేదు. సినిమా హిట్టు ఫ్లాపుల సంగతి పక్కనపెడితే అసలు రిలీజవుతుందా లేదా అన్నది చెప్పలేనట్టుగా పరిస్థితి తయారైంది. ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కు అంతా సిద్ధమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ తో చివరి నిమిషంలో థియేటర్లకు రాకుండా ఆగిపోయింది. దీంతో గోపీచంద్ తన ఆశలన్నీ గౌతమ్ నంద సినిమాపైనే పెట్టుకున్నాడు.

గౌతమ్ నంద సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో గోపీచంద్ మాట్లాడుతూ ఈ సినిమా ఏ రేంజిలో హిట్టవుతుంది అనేది చెప్పలేను కన్ఫర్మ్ గా హిట్టవుతుందని చెప్పాడు. డైరెక్టర్ సంపత్ నంది రెండున్నర గంటలపాటు ఈ సినిమా కథ చెప్పాడని... అందులో ఒక్క సీను డైలాగు కూడా పొల్లు పోకుండా తెరకెక్కించాడని చెప్పాడు. తాను పనిచేసిన డైరెక్టర్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ సంపత్ నంది అని కితాబిచ్చాడు. సంపత్ నంది స్టోరీ చెబుతుండగా దీనికి భారీ బడ్జెట్ అవుతుందని అర్ధమైందని.. ఈ విషయం ఆలోచించుకోవాలని ప్రొడ్యూసర్లు పుల్లారావు భగవాన్ చెబితే వారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకపోవడంతో సినిమా రిచ్ గా తెరకెక్కిందని చెప్పాడు. ఈ సినిమాలో పనిచేసిన ప్రధాన టెక్నీషియన్లయిన ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ ఫైట్ మాస్టర్స్ లిరిక్ రైటర్.. ఇలా ఒక్కొక్కరి గురించి పేరుపేరునా ప్రస్తావించి అందరూ అద్భుతంగా పని చేశారంటూ గోపీచంద్ ప్రశంసల జల్లు కురిపించాడు.

ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అని... మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయంలో ఇరగదీశాడంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. తన మనసుకు నచ్చిన సినిమాల్లో ఇదొకటని తమన్ చెప్పాడని... తను మనసు పెట్టి చేస్తే ఎలాగుంటుందో ఈ సినిమా మ్యూజిక్ వింటే అర్ధమవుతుందన్నాడు. ఇక హీరోయిన్ల గురించి చెప్పే విషయంలో మాత్రం గోపీచంద్ కన్ప్యూజ్ అయ్యాడు. ఈ సినిమాలో హన్సిక క్యాథరిన్ హీరోయిన్లయితే హన్సిక తమన్నాలు నటించారంటూ స్టేజీపై అనేశాడు.

,  ,  ,  ,  ,  ,