Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:49:42
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే సెక్సిణి రకుల్ ప్రీత్ సింగ్ తాను తమిళంలో చేయాల్సిన విశాల్ సినిమాను వదిలేసిందని మనకు తెలిసిపోయింది. అయితే ఈ సినిమాను వదిలివేయడం వెనుక.. రకుల్ చాలాపెద్ద టైమ్ మేనేజ్మంట్ కహానీయే వినిపించిందిలే.

రోజులకు కేవలం 5 గంటలు మాత్రమే పడుకునే రకుల్.. ఎవరైనా తనకు 2 గంటలకు ఫోన్ చేస్తాను అని చెప్పి.. ఓ 33 నిమిషాలు ఆలస్యంగా ఫోన్ చేస్తే చాలు.. మీకు టైమ్ మేనేజ్మెంట్ క్లాసులు అవసరం అంటూ క్లాస్ పీకుతుందట. అంతేకాదు.. రోజూ జిమ్.. అలాగే షూటింగ్.. అలాగే పార్టీలు.. ఇవన్నీ ఎక్కడా కూడా డిస్ర్టబ్ కాకుండా ఖచ్చితంగా టైమ్ కు వచ్చేస్తుందట రకుల్. అయితే విశాల్ సినిమా విషయంలో ఏమైందంటే.. ''జూన్ లో విశాల్ సినిమా మొదలవుతుంది అన్నారు. కాని లేటైంది. అందువలన నా ఇతర కమిట్మెంట్లు అన్నీ సెట్ చేసుకునేసరికి.. నేను ఎంతో హోప్స్ పెట్టుకున్న విశాల్ సినిమా వదులుకోవాల్సి వచ్చింది'' అంటూ వివరించింది రకుల్.

అంతేకాదండోయ్.. రకుల్ ఎన్నడూ షూటింగులకు లేటుగా రావడం వంటివి కూడా చేయదట. ఒకవేళ రకుల్ ను సినిమాలో పెట్టుకుంటే మాత్రం ఆమె పంక్చువాలిటీ చూసి మనకు ప్యాకైపోతుంది అంటున్నారు సన్నిహితులు. హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత అద్వానంగా ఉన్నప్పటికీ రకుల్ టైముకు వచ్చేస్తుందట. సో రకుల్ తో జాగ్రత్తగా ఉండండి.. రైట్ టైమ్ పాటించండి.

,  ,  ,  ,  ,  ,